Crime against women: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ ముఖాన్ని సిగరేట్లతో కాలుస్తూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధుడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి హత్య చేశారు. యూపీలోని సుల్తాన్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తాని నిందితుడు సూరజ్ కుమార్ సోంకర్ వాగ్దానం చేసింది. అయితే ముందుగా చెప్పిన విధంగా ఉద్యోగం ఇవ్వకపోవడంతో, తన డబ్బును ఇవ్వాలని మహిళను డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో మహిళపై అత్యాచారం చేసి, సిగరెట్లతో ముఖాన్ని కాల్చివేసి, గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు.
సుల్తాన్ పూర్ రోడ్డు పక్కన మహిళ మృతదేహం లభ్యమైంది. ఒళ్లంతా గాయాలతో, చెవుల నుంచి రక్తం కారుతూ ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడు సోంకర్ కోసం వెతుకుతున్నారు. హత్యకు పాల్పడిన ప్రాంతం నుంచి ఈ రిక్షా, మొబైల్ ఫోన్, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Fake Toll Plaza: గుజరాత్‌లో ఘరానా మోసం..ఏకంగా హైవేపై నకిలీ టోల్ ప్లాజా.. రూ. కోట్లు దోపిడి..
పెళ్లి వేడుకల్లో బాలికపై అత్యాచారం:
రాజస్థాన్ దౌసాలో దారుణం జరిగింది. ఓ విహాహ కార్యక్రమంలో ఆరేళ్ల బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని శుక్రవారం పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో ఫంక్షన్ వెళ్లి వచ్చిన తర్వాత బాలిక దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో దౌసాలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలికను ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు.