INDIA bloc: ఇండియా కూటమి సమావేశానికి తేదీ ఖరారైంది. బుధవారం సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, పలువురు కీలక నేతలు గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరో తేదీన ఇండియా కూటమి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 17 కూటమి నేతల భేటీ జరుగుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం తెలిపారు.
Read Also: Revanth Reddy: అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి..
బుధవారం నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లతో సహా అగ్రనేతలు సమావేశానికి రావడానికి తిరస్కరించారు. దీంతో కూటమి భేటీ వాయిదా పడింది.
ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అంతకుముందు తొలిసారిగా పాట్నాలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఆ తర్వాత బెంగళూర్, ముంబై వేదికగా సమావేశాలు జరిగాయి.