MP Subhash Chandra Baheria Came on a Scooty and cast his vote: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు (నవంబర్ 25) పోలింగ్ జరుగుతోంది. 33 జిల్లాల్లోని 199 స్థానాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని…
9.77% voting till 9 am in Rajasthan: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి 2 గంటల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత…
EC Arrenges Polling Booth for 35 Voters in Rajasthan: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. నేడు (నవంబర్ 25) రాజస్థాన్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాజస్థాన్లో మొత్తం 200 సీట్లకు గాను.. నేడు 199 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కరణ్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్…
Rajasthan Assembly Elections 2023 Voting Starts: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023కి సర్వం సిద్ధమైంది. నేడు (నవంబర్ 25) అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ఆరంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాజస్థాన్లో మొత్తం 199 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒక్క స్థానానికి పోలింగ్ జరగడం లేదు.…
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్సమంద్ జిల్లాలో ఘోరం జరిగింది. దాగుడు మూతలు ఆడుతూ ఇద్దరు బాలికలు మరణించారు. ఐస్ క్రీం ఫ్రీజన్లో చిక్కుకోవడంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఖమ్నేర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
రేపే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాజస్థాన్లో 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 51 వేల 756 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
Shivraj Singh Chouhan: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం రాజకీయ అస్త్రంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇటీవల రాజస్థాన్ జలోర్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై ‘పనౌటీ’(చెడుశకునం) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. రాహుల్ గాంధీ మానసిక స్థితి సరిగా లేదంటూ బీజేపీ విమర్శించింది.
Bulldozers roadshow: రాజస్థాన్ చివరి రోజు ప్రచారం హోరెత్తింది. ఈ నెల 25న రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం సాగించారు. గురువారం చిత్తోర్గఢ్ జిల్లాలోని నింబహెరా, రాజ్ సమంద్ జిల్లాల్లో నాథ్ద్వారాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలు కూడా జైపూర్లోని వివిధ…
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ‘పనౌటీ’(చెడు శకునం) వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.
PM Modi: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగబోతున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నాయి. ఈ సారి అధికారమే ధ్యేయంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వస్తే అన్నీ బయటకు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.