Kota: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు రాజస్థాన్ లోని కోటా నగరం పేరొందింది. ఇలాంటి ప్రాంతంలో వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైంది. సహ విద్యార్థులు ఈ దారుణాకి ఒడిగట్టారు. నిందితులు కూడా మైనర్లే అని తెలుస్తోంది. ఫిబ్రవరి 10న జరిగిన ఈ దారుణంలో, నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన తన క్లాస్‌మేట్‌తో స్నేహం చేస్తోంది. అతను బాలికను తన అపార్ట్‌మెంట్‌కి పిలిచారు. అక్కడ ప్రధాన నిందితుడు తన ముగ్గురు స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు కోటా ఏఎస్పీ ఉమా శర్మ చెప్పారు. ఫిబ్రవరి 13న మైనర్ విద్యార్థిని కోటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Read Also: Delhi HC: “భార్యపై తల్లిదండ్రుల అతి ప్రభావం”.. క్రూరత్వమే అంటూ వ్యక్తికి విడాకులు మంజూరు..
బాధితురాలకి సోషల్ మీడియా ద్వారా ప్రధాన నిందితుడు పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ప్రస్తుతం డిప్రెషన్‌లో ఉండటంతో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసును కోటా పోలీసులు ప్రత్యేక టీం విచారిస్తోంది. పథకం ప్రకారమే ఈ అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి భారతదేశం అంతటా వేలాది మంది విద్యార్థులు కోటాలో ప్రతి సంవత్సరం వస్తారు. అయితే, ఇటీవల కాలంలో విద్యార్థుల బలవన్మరణాలకు కేరాఫ్‌గా కోటా ప్రాంత ఉంది. ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.