Rahul Gandhi : 1990లలో కాంగ్రెస్ పార్టీ దళితులు, అత్యంత వెనుకబడిన కులాల ప్రయోజనాలను కాపాడాల్సిన విధంగా లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టంగా అంగీకరించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది ? చేతిలో ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు ? అని ఆమె…
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు.
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి…
MLC Kavitha : భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు.. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని ఆమె అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని… కింద స్థాయిలో పథకాలు…
Kishan Reddy : కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని, బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా సేవలు అందించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని, గత ఏడాది అయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న బిరుదు ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ నియంతృత్వ…