AICC: పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొనసాగుతున్న దీపాదాస్ ను తొలగించిన ఏఐసీసీ.. తెలంగాణకు కొత్త ఇంచార్జిని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీనాక్షి నజరాజన్ 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ నుంచి ఎంపీగా పని చేశారు. ఇక, ఆమె రాహుల్ గాంధీ టీమ్ లో కీలకంగా ఉన్నారు.
Read Also: IPL 2025: క్రికెట్ లవర్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడలేరు..
అయతే, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. ఏకపక్షంగా మున్షీ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అలాగే, నాయకుల మధ్య సమన్వయం కుదర్చ లేకపోయారన్న విమర్శల నేపథ్యంలో ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జులు నియమించగా.. పంజాబ్, జమ్ము కశ్మీర్ లకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది.