Rahul Gandhi: హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కోర్టు రూ. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలోని పటేల్ నగర్ ప్రాంతంలోని కావెంటర్స్ షాపును సందర్శించారు. రాహుల్ రాకతో సిబ్బంది ఆహ్వానించారు. కాఫీ ఇవ్వాలని సిబ్బంది అడిగగా.. రాహులే స్వయంగా తయారు చేసుకుని ఆస్వాదించారు.
Kangana Ranaut: తొలి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. ఇక, తన సినిమాను వీక్షించేందుకు రాహుల్‌ను ఆహ్వానించేందుకు వెళ్లగా.. ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని ఆమె తెలిపింది.
Rahul Gandhi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటకు వెళ్లడంపై బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టూర్‌కి వెళ్లడాన్ని ప్రశ్నించారు.
TPCC Mahesh Kumar : జల్-జమీన్-జంగిల్ (నీరు, భూమి, అటవీ వనరులు) నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార హోటల్లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు.…
K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి…
జమ్మూకాశ్మీర్‌లోని బందీపోర్లో ఆర్మీ వాహనానికి ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
Jai Bapu Jai Bhim Jai Constitution: కాంగ్రెస్ పార్టీ జనవరి 3, 2025 నుండి “జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రచారం జనవరి 26, 2025న మధ్యప్రదేశ్‌లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. Also Read: Udayabhanu : విలన్ గా…
Pinarayi Vijayan: ‘‘కేరళ మిని పాకిస్తాన్’’ అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ‘‘ తీవ్రమైన హానికరమైనవి’’, ‘‘పూర్తిగా ఖండించదగినది’’ అని అభివర్ణించారు.
Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.