టెంపుల్ సిటీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి పొలిటికల్ బొకేలు.. నూతన సంవత్సరం సందర్భంగా ఆయా నేతలకు ఇవ్వడానికి తిరుపతిలోని బొకేల షాపులు ఏర్పాటు చేసిన బొకేలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. ఆయా పార్టీలకు సంబంధించిన రంగులన్న పూలతో తయారు చేసినా బొకేల్లో.. ఆ పార్టీలకు చెందిన నేతల ఫొటోలను కూడా పొందుపరిచారు..
మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మన్మోహన్ సింగ్ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.
Rahul Gandhi: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలంపై వివాదం నెలకొంది. మాజీ ప్రధానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. స్మారక చిహ్నం నిర్మించడానికి కేటాయించిన స్థలంలో ఆయన అంత్యక్రియలు చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనని తిరస్కరించడం ద్వారా బీజేపీ మన్మోహన్ సింగ్‌ని అవమానించిందని రాహుల్ గాంధీ శనివారం అన్నారు. ‘‘భారతదేశ గొప్ప కుమారుడు, సిక్కు సమాజానికి మొదటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ…
Manmohan Singh Last Rites: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు వయసు 92 ఏళ్లు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం తెల్లవారుజామున మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ,…
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఇప్పుడు ప్రజల సందర్శనార్ధం డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఇక్కడ ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తారు. దీని తర్వాత అతని అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహిస్తారు. ఆర్మీ వాహనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుక వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆర్మీ వాహనం ఆపి, ఆయన మృతదేహాన్ని భుజాలపై మోసుకొని లోపలికి తీసుకెళ్లారు.…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు.
Congress: భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఘన నివాళులు అర్పించారు.