Kishan Reddy: త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. కేంద్రమంత్రి
- వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
- త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు.
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించారని, కానీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైందని, అధికారంలోకి వచ్చాక నిధుల కోసం భూములు అమ్మాలని మాత్రమే ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కనీసం రంగులు వేయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ కుటుంబ పాలన చేసి అప్పులు చేసిందని, దోచుకుంది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ప్రణాళిక లేని పాలన సాగుతోంది, హామీలు అమలు చేయడంలో అసమర్థతను ప్రదర్శిస్తున్నారు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ప్రజల సమస్యల కోసం బీజేపీ రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి, తగిన బుద్ధి చెప్పాలంటూ ఉపాధ్యాయులను, పట్టభద్రులను కోరారు.తెలంగాణ సీఎం ప్రతివారం ఢిల్లీలో అటెండెన్స్ వేయడం కొత్త ట్రెండ్ అయ్యిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇప్పటివరకు ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేను సమర్థించలేదని అన్నారు. బీజేపీ ఎప్పటికీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు అనుమతిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామన్నారు. కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీది ఏ కులమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు. బీసీల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్, తమ నాయకుల కులం వెల్లడించడంలో ఎందుకు వెనుకడుగేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు త్వరలో మారబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి, ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఫలితాల తర్వాత తెలుస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన సమరం నెలకొంది.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..