రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు.. ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. ఆయన వెంట ఆయన సోదరి, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అయితే, ర్యాలీలో పాల్గొన్న నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఇవాళ ఈడీ ముందుకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఇదే సమయంలో సత్యమేవ జయతే అంటూ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చారు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ…
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఇటీవల సమన్లు జారీ చేసింది ఈడీ… విచారణకు హాజరుకావాలని కోరింది. జూన్ 13న ఈడీ ముందు రాహుల్ హాజరుకానుండగా.. 23వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది.. Read Also: Astrology: జూన్ 13 సోమవారం దినఫలాలు…
నేషనల్ హెరాల్డ్” కేసు విచారణ వేగంగా సాగడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణ కు సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ రోజు (జూన్ 8) విచారణకు హాజరవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED). సోనియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు కాకుండా,…
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అల్లర్లకు తెరలేపాయి. అంతేకాదు.. ఇస్లామిక్ దేశాలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం దోహాలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది కూడా! నుపుర్‌తో పాటు ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్‌పై పార్టీ వేటు వేసినప్పటికీ.. ఆ లోపే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీసర వేదికగా చింతన్ శిబిర్ కార్యక్రామాన్ని నిర్వహించింది. దీంతో పాటు తెలంగాణలోని సమస్యలు, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఎలా ఎండగట్టాలనే విషయాలపై చర్చ జరిగింది. దీంతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, సంస్థాగత, రైతులు, యువత ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని తెలంగాణ సమస్యలపై చర్చించారు. బుధవారం, గురువారం రెండు రోజులు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ కేసులతో వేధిస్తోందని అంటున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పెట్టిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పై బీజేపీ కేసులు పెడుతోందని విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క ఈ అంశంపై ఫైర్ అయ్యారు. కీసరలో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్…