ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న సమయంలో పార్టీలు పొత్తు పెట్టుకోవడం సహజం. ఇది రాజకీయ తంత్రం.. ఎప్పుడు, ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్న వాళ్ళే రేపు చేతులు కలపొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో పొత్తు చర్చలు మొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. రైతు సంఘర్షణ సభలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కాంగ్రెస్…
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీకి వివరించారు. రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు.…
వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల స్పప్నమన్నారు. కానీ, తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు. మీ అందరి కల నెరవేర్చడానికి అనేకమంది రక్తం చిందించారని, కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని, సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ ఘడ్లో రైతులు రుణమాఫీ…
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అటు రైతు కూలీలకు ఏడాదికి…
ఈరోజు తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలిమెట్టు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్…
భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని మోసం చేస్తున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. కానీ ఏడేళ్ళలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభలో ఆయన మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల్ని దగా చేస్తున్నాయి. వివిధ తెగుళ్ళు, వ్యాధులు వచ్చి పంటలు…
వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మనం ఏం చేయబోయేది తెలియచేద్దాం. దేశంలో ప్రగతి పథంలో నడిపించింది కాంగ్రెస్. రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రైతునే రాజుగా చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ అందించాం. ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. రైతులకు రుణమాఫీ చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో వెళ్లనున్నారు. అక్కడినించి హనుమకొండకు బయల్దేరతారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో…
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటల్ని సాగు చేయాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి, పంటల సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి,…