ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. రాహుల్‌గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్ఎస్ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో…
ధాన్యం కొనలేని కేసీఆర్.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండి పడ్డారు. ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. ఇవాళ బ్యాంకులకు రెండున్నర రెట్లకుపైగా బకాయిపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నివిధాలుగా సంక్షోభంలో ఉన్న రైతుల్లో మానసిక, మనోధైర్యాన్ని నింపేందుకే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోకూడదని, మీడియాకి ఎక్కి పార్టీ పరువును గంగపాలు చేయవద్దన్న సూచనలకు అనుగుణంగా తాజా పరిణామాలపై వీహెచ్ తనదైన రీతిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పై వీహెచ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో మాట్లాడినా బీసీ, ఎస్సీ ఎస్టీల లో ఒక విధమైన ఆలోచన వచ్చింది. కానీ నీ విషయంలో నేను బయట మాట్లాడలేను. నేను ఓబీసీ…
రాహుల్ గాంధీ లండన్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ థింక్ ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో కేంద్రంపై, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ జల్లిందని కేవలం ఒక నిప్పు చాలు సంక్షోభానికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విదేశాంగ శాఖ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానం మారిందని వారు అంటున్నారు… అహంకారంతో ఉన్నారంటూ…
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీకి అసద్ సవాల్ చేయాల్సిన అవసం ఏముంది..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? అని నిలదీశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఇచ్చిన రాహుల్.. ఇక్కడ…
యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి…
మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఇవాళ. జాతీయ ఉగ్రవాద వ్యతిరేకదినంగా ఈరోజుని జాతియావత్తూ జరుపుకుంటోంది. రాజీవ్ గాంధీ 1991, మే 21న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ దేశమంతా విస్తృతంగా తిరగుతున్నారు. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీ పెరంబదూర్ కు రాజీవ్ గాంధీ మే 21న ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఎల్ టీటీఈకి చెందిన థాను, శివరాజన్, హరిబాబు తదితరులు అప్పటికే…
తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్‌కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా..…
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు. 2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే…
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నవ సంకల్స్ శిబిర్ పేరిట మూడు రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో ముఖ్య నేతల నుంచి పలు కీలక సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు నవ సంకల్స్ శిబిర్ సదస్సు ముగింపు సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ ఏడాది గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్…