ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీకి అసద్ సవాల్ చేయాల్సిన అవసం ఏముంది..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? అని నిలదీశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఇచ్చిన రాహుల్.. ఇక్కడ…
యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి…
మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఇవాళ. జాతీయ ఉగ్రవాద వ్యతిరేకదినంగా ఈరోజుని జాతియావత్తూ జరుపుకుంటోంది. రాజీవ్ గాంధీ 1991, మే 21న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ దేశమంతా విస్తృతంగా తిరగుతున్నారు. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీ పెరంబదూర్ కు రాజీవ్ గాంధీ మే 21న ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఎల్ టీటీఈకి చెందిన థాను, శివరాజన్, హరిబాబు తదితరులు అప్పటికే…
తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ను సీరియస్గా తీసుకుంది. వచ్చే నెల రోజుల కార్యాచరణ ప్రకటించింది కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ప్రొగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాన్ని చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇద్దరు ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాలేదు. కొందరు ఉదయపూర్ చింతన్ శిబిర్కి వెళ్లడంతో రాలేదని చెబుతున్నా..…
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు. 2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే…
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నవ సంకల్స్ శిబిర్ పేరిట మూడు రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో ముఖ్య నేతల నుంచి పలు కీలక సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు నవ సంకల్స్ శిబిర్ సదస్సు ముగింపు సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ ఏడాది గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్…
వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్.. పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీని కోసం కాంగ్రెస్ అధిష్టానం.. 3 రోజుల పాటు ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్-2022’ పేరిట రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా మేధోమథన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు ఈ నెల 13న ప్రారంభం కాగా.. నేడు ముగిసింది. అయితే.. ఈ “నవ సంకల్ప్ శిబిర్” సదస్సులో పలు కీలక నిర్ణయాలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. అవి.. ఒక కుటుంబానికి ఒక టిక్కెట్. 50…
కాంగ్రెస్ పార్టీ తనను తాను సంస్కరించుకోవాలని చూస్తోంది. దీనికి రాజస్తాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న ‘ నవ కల్పన్ శింతన్ శిబిర్’ వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘ ఒక కుటుంబం- ఒక సీటు’ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తనపై ఉన్న కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకోవాలని అనుకుంటోంది. దీంతో పాటు పార్టీలో పనిచేసే వారికి మాత్రమే పదవులు, టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.…
వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటోంది. అందుకు ఉదయ్ పూర్ లో జరిగే ‘ శింతన్ శిబిర్’ వేదిగా మారబోతున్న సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శింతన్ శిబిర్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కీలక నేతలు రాజస్థాన్…
రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్ లో పార్టీ చేసుకుంటున్న వీడియోను ఈసారి బీజేపీ రిలీజ్ చేసింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుకుతూ పలు విమర్శలకు దారి తీస్తోంది. ఐఎన్సీ అంటే ‘ఐ నీడ్ సెలబ్రేషన్ అండ్ పార్టీ’ అంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ జాతీయ…