Rahul Gandhi: మళ్లీ గబ్బర్‌సింగ్ స్ట్రైక్ అంటూ జీఎస్టీ రేట్ల పెంపుపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Fires For Hiking GST Rates: ఆధార ధరలపై కేంద్రం జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పన్నులు పెంచుతున్నారు కానీ, ఉద్యోగాలు ప్రకటించడం లేదంటూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘పన్నులేమో అధికం, ఉద్యోగాలేమో శూన్యం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని నాశనం చేయడంలో బీజేపీది మాస్టర్ క్లాస్ పనితీరు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణించిన రాహుల్.. ఈరోజు నుంచి ఏయే వస్తువులపై పన్నులు విధించనున్నారోనన్న విషయంపై ఓ గ్రాఫ్‌ను షేర్ చేశారు.నిత్యావసర వస్తువులైన పెరుగు, పన్నీర్, బియ్యం, గోధుమలు, బార్లీ, బెల్లం, తేనె, బటర్‌మిల్క్ వంటి వాటిపై గతంలో ఎలాంటి పన్నులు లేవని.. ఇప్పుడు 5% పన్నులు విధించారంటూ రాహుల్ పేర్కొన్నారు. అలాగే హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్‌పై జీఎస్టీని భారీగా పెంచారంటూ తెలిపారు.
అలాగే, రాహుల్‌కి వరుసకు సోదరుడు అయ్యే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం తన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతుంటే, ఈ దశలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇకపై మధ్యతరగతి జేబులు మరింత ఖాళీ అవుతాయి. ముఖ్యంగా ఉపాధి లేక అద్దె ఇండ్లలో నివసిస్తున్న యువతపై ఇంకా భారం పడుతుంది. వాళ్లకు ఉపశమనం ఇవ్వాల్సింది పోయి, ఇంకా ఇబ్బంది పెడుతున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. తాను బీజేపీకి చెందినవాడ్ని అయినప్పటికీ, ప్రజా సమస్యలపై మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు జీఎస్టీపై ట్వీట్లు వేయడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
HIGH taxes, NO jobs
BJP’s masterclass on how to destroy what was once one of the world’s fastest growing economies. pic.twitter.com/cinP1o65lB
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2022
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!