నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆఫీసుకి విచారణ కోసం రాహుల్ గాంధీ ఈరోజు కూడా వచ్చారు. గత రెండురోజులుగా గంటల కొద్దీ విచారణ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి, బస్సులలో వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు పోలీసులు.’మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని కాంగ్రెస్ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఇవాళ కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించింది. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు- రాహుల్ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ…
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) రెండో రోజు ప్రశ్నిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు విచారించిన ఈడీ దాదాపుగా 10 గంటల పాటు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. మంగళవారం రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఇదిలా ఉంటే ఢిల్లీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతల విచారణ సాగుతోంది. సోమవారం రోజు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. అయితే మంగళవారం ( జూన్14)న కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీని నేడు కూడా విచారించనుంది ఈడీ. సోమవారం విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ దాదాపుగా 10 గంటల పాటు విచారించింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన విచారణ రాత్రి…
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై…
గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ..సోనియా గాంధీకి బీజేపీ నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబంకి అండగా ఉంటామని, సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. నేషనల్…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. అందులో భాగంగా ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ.. ముగ్గురు అధికారుల ఈడీ బృందం రాహుల్‌ను ప్రశ్నించింది.. నేషనల్ హెరాల్డ్‌తో సంబంధాలు, ఏజేఎల్‌లో ఉన్న స్థానం, యంగ్ ఇండియాలో పాత్రపై రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుండగా.. ఆయన మాత్రం తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం.. అయితే,…
రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు.. ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. ఆయన వెంట ఆయన సోదరి, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అయితే, ర్యాలీలో పాల్గొన్న నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ…