2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో రాజస్థాన్‌లో జరిగిన చింతన్ శివిర్‌లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించి, దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రియాంక గాంధీతో పాటు పీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. 148 రోజుల పాటు, 12 రాష్ట్రాల్లో 3600 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగనుంది. భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ అధినేత పలు కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే.
Harish Rao : రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే రాష్ట్రాల్లో తిరిగి తమ ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులోభాగంగానే దేశవ్యాప్తంగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అన్నిప్రాంతాలను కలుపుతూ యాత్ర సాగేలా ప్లాన్ చేస్తోంది. ప్రజలకు చేరువకావడమే లక్ష్యంగా పాదయాత్రకు పూనుకుంటోంది. ఏడాదిపాటు జరిగే ఈ మహాపాదయాత్రలో రాహుల్ గాంధీతోపాటు పార్టీ సీనియర్ నేతలు ఉండేలా సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.