నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ కేసులతో వేధిస్తోందని అంటున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పెట్టిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పై బీజేపీ కేసులు పెడుతోందని విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క ఈ అంశంపై ఫైర్ అయ్యారు. కీసరలో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో తాజాగా ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. జూన్ 5న రాహుల్ గాంధీని, జూన్ 8న సోనియాగాంధీని తమ ముందు హాజరు కావాలని కోరింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డు చేసుకోనున్నారు ఈడీ అధికారులు. అయితే కాంగ్రెస్ నాయకులకు సమన్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా గాంధీని ఈనెల 8న హాజరు కావాలని కోరగా.. రాహుల్ గాంధీని అంతకన్నా ముందే జూన్ 5న హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి ఈడీ సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీ ఈడీ సమన్లకు కట్టుబడి ఉన్నారని…
జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా ధర్నా చేస్తుంటే.. బీజేపీ ఎనిమిదేళ్ల పాలన వేడుకల్లో బిజీగా ఉందని ఆరోపించారు. మంగళవారం కుల్గామ్‌లో ఉపాధ్యాయురాలు రజనీ బాలాపై కాల్పులు జరుపడంతో ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో రాహుల్ స్పందించారు. ‘లోయలు శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు నిజం. కశ్మీర్లో గత ఐదు…
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరే డిఫరెంట్. ఎవరు ఏం చెప్పారు అనే దానికంటే.. మాకు నచ్చింది మేము చేస్తాం అనే ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. వరంగల్ వేదికగా..రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్. వచ్చే నెల రోజుల్లో క్షేత్ర స్థాయికి డిక్లరేషన్ తీసుకు వెళ్లాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. ఆ వెంటనే ప్రకటనలు చేసేసి.. సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ ప్రకటించారు పార్టీ నేతలు. ఆ షెడ్యూల్ ప్రారంభించి వారం అయ్యిందో, లేదో… నాయకులు అంతా గాయబ్ అయ్యారు. కింది…
ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ…
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ, మురళీ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి. 2018లో పరకాలలో సురేఖ ఓటమి తర్వాత పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక ఆయనకు దగ్గరయ్యారు. మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతారని భావించాయి పార్టీ శ్రేణులు. ఇంతలో హుజూరాబాద్ ఉపఎన్నిక పీసీసీ చీఫ్, కొండా ఫ్యామిలీ మధ్య దూరం పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ తూర్పు తమ సొంత నియోజకవర్గంగా…
కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూ కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్‌గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్…
రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ…