Congress Party President Election: కాంగ్రెస్ పార్టీ త్వరలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ అధ్యక్షతన ఆగస్టు 28న మధ్యహ్నం 3.30 గంటలకు వర్చువల్ గా
Sonia Gandhi to travel abroad for medical check-ups: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే వారి పర్యటకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని బలవంతంగా ఒప్పించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోతే.. ఆ పదవి చేపట్టేలా ఆయనను బలవంతం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
''భారత్ జోడో'' పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు.
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) ఇవాళ భేటీ కాబోతోంది. సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. పార్టీ అధినేత్రి సోనియా కోవిడ్ నుంచి కోలుకోగానే సీడబ్ల్యూసీనీ ఏర్పాటు చేసింది.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో…
Rahul Gandhi targets PM over release of Bilkis Bano case convicts: బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న 11 మందిని విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఫైర్ అవుతోంది. గ్యాంగ్ రేప్, హత్యలు చేసిన నిందితులను సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయడంపై బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. నారీ శక్తి అని స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రసంగించిన ప్రధాని మోదీ కొన్ని గంటల్లోనే…
Congress Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకుని దేశంలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం…
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది, అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.
కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్…