కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఈరోజు తాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందన్నారు.
కాంగ్రెస్‌తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవలే ముగించుకున్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, తన మాజీ పార్టీకి చెందిన నాయకులు తనపై క్షిపణులు ప్రయోగించినప్పుడు మాత్రమే తాను రైఫిల్‌తో ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా.. స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.