త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
Jammu and Kashmir Congress leaders resign: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కపిల్ సిబల్, జ్యోతిరాథిత్యా సింథియా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పి వేరే పార్టీల్లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పవచ్చు. ఆజాద్…
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీలో బరిలో దిగాలని శశిథరూర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళయాళ దిన పత్రిక "మాతృభూమి"లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల జరగాలని ఆయన చెప్పారు.
గత వారం కాంగ్రెస్ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ "అర్ధరహితంగా" ఉందని ఆరోపించారు. జీ23 లెటర్ రాయడమే రాహుల్ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్ అనుకుందని.. అందుకే న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.