Goa CM Pramod Sawant: గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ ఈ రోజు అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కలిసి బీజేపీలో చేరారు. ‘పీఎం మోడీ, సీఎం ప్రమోద్ సావంత్‌ల నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు 2/3 వంతు మెజారిటీతో బీజేపీలో విలీనం చేశాం.. ‘కాంగ్రెస్ చోడో, బీజేపీ కో జోడో’ అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు.
రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విరుచుకుపడ్డారు. నాయకులను పార్టీలోకి స్వాగతిస్తూ “కాంగ్రెస్ చోడో యాత్ర ఇప్పుడు గోవా నుంచి ప్రారంభమవుతుంది” అని అన్నారు. గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు 20 మంది సొంత సభ్యులతో 40 మంది సభ్యులు గల గోవా శాసనసభ్యలో బీజేపీ ఇప్పటికే 25 మంది సభ్యులను కలిగి ఉంది. ప్రస్తుతం 8 మంది కాంగ్రెస్ సభ్యుల చేరికతో వారి సంఖ్య 33కి చేరుకుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై పోరాడడానికి, దేశ ప్రజలను మేల్కొలపడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం గమనార్హం.
PM Narendra Modi: శుక్రవారం పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ.. అజెండా ఏమిటో తెలుసా?
కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సెప్టెంబర్ 4న గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు, ఇది పార్టీకి పెద్ద కుదుపుగా పరిగణించబడుతుంది. సెప్టెంబర్ 2న, రాజౌరిలోని నౌషేరాకు చెందిన దివంగత మాస్టర్ బెలి రామ్ శర్మ కుమారుడు అయిన పార్టీ నాయకుడు రాజిందర్ ప్రసాద్ అన్ని పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ పతనానికి కోటరీ వ్యవస్థే కారణమని ప్రసాద్ ఆరోపించారు.ఇటీవల కాలంలో రాజిందర్ ప్రసాద్ సహా పలువురు ఉన్నత స్థాయి నాయకులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రముఖ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడం ఆ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. వృత్తిరీత్యా న్యాయవాది, యువ కాంగ్రెస్ నాయకులలో ప్రముఖులలో ఒకరైన జైవీర్ షెర్గిల్, నిర్ణయాధికారుల దృష్టి ఇకపై యువత ఆకాంక్షలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ ఆగస్టు 24న తన రాజీనామాను సమర్పించారు. ఈ ఏడాది మేలో జీ-23 అసమ్మతి నేతల గ్రూపులో ప్రముఖమైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి, సమాజ్‌వాదీ పార్టీ (SP) మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ కూడా ఈ ఏడాది మేలో కాంగ్రెస్ నుంచి విడిపోయారు. 46 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తర్వాత కేంద్ర మాజీ న్యాయ మంత్రి అశ్వనీ కుమార్ కూడా ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
Goa | 8 Congress MLAs including Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes join BJP in presence of CM Pramod Sawant pic.twitter.com/uxp7YaZAUN
— ANI (@ANI) September 14, 2022