Congress Party President: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ప్రక్రియ పూర్తికావాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
Priyanka Gandhi tests positive for Covid-19: కాంగ్రెస్ కీలక నేత, జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకు ముందు ఈ ఏడాది జూన్ లో ప్రియాంకా గాంధీ కోవిడ్ బారినపడి కోలుకున్నారు. తరువాత నెల వ్యవధిలోనే మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు.
Cheruku Sudhakar: తెలంగాణ పొలిటికల్ లో ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే.. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో షేక్ హ్యాండ్ తీసుకోవడమే కాకుండా.. తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసారు. read also:Vice President Election: విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు…
పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశంలో వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
కర్ణాటకలోని చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని పలువురితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడి స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్వామీజీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అనగానే.. వెంటనే మఠాధిపతి కలుగుజేసుకుని దానిని సరిజేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.