తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది.. పూటకో మలుపు.. గంటకో ట్విస్ట్ అనే తరహాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజీనామా చేసే పార్టీలోకి రావాలని బీజేపీ కండీషన్ పెడితే.. అసలు రాజగోపాల్‌రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు.. రాష్ట్ర నేతలతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగినా.. రాజగోపాల్‌రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గినట్టుగా కనిపించడంలేదు.. రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్…
కొందరి ప్రతిభకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. కుర్రాడికి ఆట పట్ల ఉన్న ప్రేమతో పాటు.. అతని ప్రతిభ ఏ పాటితే తెలియజేసేలా ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.. బౌలింగ్ సాధన చేస్తున్న ఆ కుర్రాడు.. తన బౌలింగ్‌తో ఎంతోమంది హృదయాలను బౌల్డ్ చేశాడు.. అందులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.. రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ లో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు…
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడో రోజు విచారించనుంది ఈడీ. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు సోనియా గాంధీ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు సోనియా. సోనియా గాంధీ విచారణ సందర్భంగా నిన్నంతా ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజనైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోసారి విచారణకు హాజరయ్యారు.
తన కూతురిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతుందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి అయిన తన కూతురుని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని.. ఆమె క్యారెక్టర్ ను హత్య చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 2014, 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయడమే తప్పు అని..…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.