Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..
- అమృత్‌పాల్ సింగ్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కి ప్రాణహాని..
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పంజాబ్ పోలీసులు..
- మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్యని ప్రస్తావించిన రాష్ట్ర్ర ప్రభుత్వం..
- అమృత్‌పాల్ సింగ్ అనుచరుల పిటిషన్లకు పోలీసులు సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్‌పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్‌పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్‌లను ప్రస్తావించారు.
పంజాబ్ పోలీసులు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ముందు ఈ వాదనలు చేశారు. అమృత్‌సర్(రూరల్) ఎస్ఎస్పీ చరణ్‌జిత్ సింగ్ ద్వారా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయబడింది. అమృత్‌పాల్ సింగ్‌కి సంబంధించిన ఓ వీడియోలో.. దివంగత పంజాబ్ మాజీ సీఎ బియాంత్ సింగ్‌కి పట్టిన గతే భగవంత్ మాన్‌కి పడుతుందని హెచ్చరించాడు. బియాంత్ సింగ్ మార్గంలోనే ఆయన పనిచేస్తు్న్నారని, మానవబాంబుతో భగవంత్ మాన్‌ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ వీడియోని పోలీసులు కోర్టు ముందు ఉంచారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
Read Also: Chiranjeevi: బ్రేకింగ్: గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి
పంజాబ్ పోలీస్ అధికారి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఫిబ్రవరి 2023 అజ్నాలా పోలీస్ స్టేషన్ సంఘటన తర్వాత, అమ్రిత్‌పాల్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల మాట్లాడిన వీడియోలో.. మాజీ సీఎం బియాంత్ సింగ్‌కి పట్టిన విధినే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎదుర్కొంటారని హెచ్చరించారు. ‘‘సీఎం భగవంత్ మాన్, మాజీ సీఎం బియాంత్ సింగ్ దారిలో నడవద్దని హెచ్చరిస్తున్నాము. సీఎం మాన్ ఇప్పటికీ ఆయన దారిలోనే నడుస్తున్నాడు. దిలావర్ ఒక మానవబాంబుగా మారి సీఎం బియాంత్ సింగ్‌ని పేల్చేశాడు. ఈ రోజు ఈ జనసమూహం నుంచి అనేక మంది దిలావర్‌లు పుట్టుకొచ్చారని గుర్తుంచుకో. ’’ అని అమృత్‌పాల్ సింగ్ హెచ్చరించిన వీడియోని పంజాబ్ పోలీసులు ప్రస్తావించారు.
అమృత్‌పాల్ సింగ్ చేసిన ఉద్వేగభరితమైన మాటలు పంజాబ్ యువతను, ఇతర దేశాలలో తప్పుదోవ పట్టించే ధోరణిలో ఉన్నాయని, ఈ చర్యలు యువతను దిలావర్ సింగ్‌గా మారి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మాన్‌ని హత్య చేయాలని ప్రోత్సహిస్తున్నాయని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ భావజాలంతో ఏకీభవించని ప్రతీ ఒక్కరికి కూడా హాని కలిగించే విధంగా, శాంతిభద్రతలకు, పబ్లిక్ ఆర్డర్‌కి ఇబ్బందులు తలెత్తుతాయని పంజాబ్ పోలీసులు హైకోర్టులో సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్ దేశ భద్రత చట్టాల కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. ఇతని అనుచరులు సరబ్జీత్ సింగ్ కల్సి మరియు గుర్మీత్ సింగ్ గిల్ అలియాస్ గుర్మీత్ భుక్కన్‌వాలా దాఖలు చేసిన వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమను నిర్భందించడాన్నా వీరు సవాల్ చేశారు. దీనికి సమాధానంగానే పంజాబ్ పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!