ఇంటర్ పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రశ్నలు అడగడంపై పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. మార్చి 4 నుంచి పంజాబ్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అయితే ఈ ప్రశ్నాపత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పలు ప్రశ్నలు వచ్చాయి.
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు.
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ముఖ్య సలహాదారుడిగా తన గుండా బిభవ్ కుమార్‌ని కేజ్రీవాల్ నియమించారని, పంజాబ్ నుంచి దోచుకున్న డబ్బుని ఢిల్లీకి తీసుకువస్తున్నడని మంగళవారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తనను తాను సరిదిద్దుకోవాలని లేకపోతే ఢిల్లీలో జరిగిందే పంజాబ్‌లో జరుగుతుందని హెచ్చరించారు.
AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది.
Punjab: పంజాబ్ పాటియాలాలో నిర్వహించిన సోదాల్లో రాకెట్ మందుగుండు సామాగ్రి దొరికింది. పేలుడు పదార్థాలు దొరకడంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళన వ్యక్తమైంది. అనుమానాస్పద పదార్థాల గురించి పోలీసులకు సమాచారం అందడంతో, పాటియాలాలోని రాజ్‌పురా రోడ్డులోని చెత్త కుప్పలో సోదాలు జరిపారు. దీంట్లో మందుగుండు సామాగ్రి దొరికినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. Read Also: CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ. 69 వేల జీతం…
Ambedkar Statue : దేశమంతా గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా అమృత్‌సర్‌లో కొంతమంది వ్యక్తులు టౌన్ హాల్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
Inter University Games: పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచానికి చేదు అనుభవంగా మిగిలింది. మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులు అసంతృప్తిగా ఉండటంతో ఈ గొడవ ప్రారంభమైందని సమాచారం. మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పంజాబ్‌లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్…
Dog Attack: దేశంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు వీటికి టార్గెట్‌గా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధరాలిపై కుక్కల గుంపు దాడి చేసింది. పంజాబ్ ఖన్నాలోని నాగరిక నాయి అబాది ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.