Bajinder Singh: పంజాబ్‌కు చెందిన పాస్టర్, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్ బాజిందర్ సింగ్‌కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఫైనల్ చేసింది. బాజిందర్ సింగ్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఈరోజు (ఏప్రిల్ 1న) తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని మొహలీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే, బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జిరాక్‌పుర్‌కు చెందిన ఓ మహిళ 2018లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. విదేశాలకు తీసుకెళ్తానని ఆశ పెట్టిన అతడు తనను ఇంటికి ఆహ్వానించాడని పేర్కొనింది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడని ఆరోపణలు చేసింది. సదరు పాస్టర్ డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చింది.
Read Also: Chennai: నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌లో కొత్త రూల్స్.. తెలియక తెలుగు టూరిస్టులు ఇబ్బందులు
ఇక, మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పాస్టర్ బాజిందర్ సింగ్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపిన న్యాయస్థానం.. అతడిని దోషిగా తేల్చుతూ జీవిత ఖైదు విధించింది. కాగా, హర్యానాకు చెందిన బాజిందర్ సింగ్ ఓ జాట్ కుటుంబంలో జన్మించాడు. 2012లో మతబోధకుడిగా మారాడు. జలంధర్, మొహాలిలలో ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేసిన.. అనతికాలంలోనే పాపులర్ అయ్యాడు. అతడికి సోషల్ మీడియాలోనూ లక్షలాది ఫాలోవర్లు ఉన్నారు.