పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి తొలుత కేజ్రీవాల్.. పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి… ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని భావించినట్లు వార్తలు వినిపించాయి. కానీ పంజాబీయులు బయట వ్యక్తులను అంగీకరించరని తెలియడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj : గ్లోబల్ లెవల్ లో డాకు మహారాజ్ ట్రేండింగ్.. దటీజ్ బాలయ్య
ఇక రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా.. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి కేజ్రీవాల్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆరోపించారు. మొత్తానికి అంతా అనుకున్నట్టు జరిగితే.. కేజ్రీవాల్ త్వరలో పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ఇక సంజీవ్ అరోరా పదవీకాలం 2028 లో ముగియనుంది.
ఇది కూడా చదవండి: YS Jagan: వైరల్ ఫీవర్‌తో బాధపడుతోన్న జగన్.. అయినా రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. అతిషి మాత్రం అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Punjab | Aam Aadmi Party has fielded Rajya Sabha MP Sanjeev Arora as its candidate for the Ludhiana West by-election. pic.twitter.com/0dEdJpwA29
— ANI (@ANI) February 26, 2025