Punjab: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు.
Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సరిహద్దుల్లోని రైతులకు కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దు వెంబడి ఉన్న రైతులు 48 గంటల్లో పంట కోత పూర్తి చేసి తమ పొలాలను ఖాళీ చేయాలని శనివారం బీఎస్ఎఫ్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
Punjab: పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Punjab: పంజాబ్ జలంధర్‌లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా నివాసం వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కేసును 12 గంటల్లో ఛేదించామని పోలీసులు వెల్లడించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ‘‘పెద్ద కుట్ర’’ జరిగిందని పంజాబ్ పోలీసులు తెలిపారు.
RR vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి నుంచి బ్యాటర్లు బౌండరీలతో అదరగొట్టారు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 67 పరుగులతో అదరగొట్టాడు. అతనికి తోడుగా రియాన్ పరాగ్ 43 పరుగులతో అండగా నిలిచాడు.…
Amandeep Kaur: ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ పంజాబ్ లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్ 17.71 గ్రాముల నిషేధిత హెరాయిన్ డ్రగ్‌తో పట్టుబడింది. ఆమెను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఒక రోజు తర్వాత గురువారం ఆమెను పంజాబ్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘‘ యుధ్ నషేయన్ విరుధ్’’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌర్ అరెస్ట్ జరిగింది.
లోక్‌సభ మాజీ ఎంపీ, బీజేపీ నేత, సూఫీ గాయకుడు హన్స్ రాజ్ భార్య రేషమ్ కౌర్(62) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం ఆమె దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు.
Bajinder Singh: పంజాబ్‌కు చెందిన పాస్టర్, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్ బాజిందర్ సింగ్‌కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఫైనల్ చేసింది. బాజిందర్ సింగ్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఈరోజు (ఏప్రిల్ 1న) తీర్పు వెల్లడించింది.
Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.