ఏపీలో పింఛన్ దారుల్లో వాలంటీర్లకు మంచిపేరు తెచ్చి పెట్టిందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. చంద్రబాబు హయాంలో రెండు మూడు రోజుల సమయం పట్టేదని.. పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు. వాలంటీర్లు పింఛన్ దారులకు దేవుళ్లుగా కనిపించారన్నారు.
హెరిటేజ్ మీది కాదు.. మోహన్ బాబుది అని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. జైలులో ఉండి కూడా మా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారు.. ఆరు నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు వచ్చేసింది.. నార్కో టెస్ట్ పెడుతా మీకు నేను ప్రశ్నలు అడుగుతా అని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కేవలం కమ్మ వాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నావు.. కమ్మవాళ్లల్లో కూడా కేవలం నీ చెంచా చంద్రబాబునే కోరుకుంటావు.. మద్యపానం నిషేధిస్తే పెద్ద పెద్ద ఫోటోస్ వేసి రాశావు.. మళ్లీ మద్యపానం కావాలని ఇన్కమ్ కోసం ఉండాలని నువ్వే రాశావు అని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.
Umapathi Trailer Launched: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది ఈ క్రమంలోనే అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్…
నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి.. అందులో 38 మందిని నంది అవార్డులకు ఎంపిక చేశారు.. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరుగుతందన్నారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ.. ఈ నెల 23వ తేదీన నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Posani Krishna Murali: ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.
చంద్రబాబు మెంటల్లీ సిక్ అని చెప్పి జైలుకు తీసుకువస్తావా పవన్? పోసాని కృష్ణమురళి అడిగారు. అసలేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా పవన్?.. కాపు నాయకుడ్ని, లెజెండ్ ని చంపిన దుర్మార్గుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తావా పవన్.. కాపు వ్యతిరేకి చంద్రబాబు.. మీరు ఎవర్నైనా ఎన్నుకోండి.. ఎవరికైనా ఓట్లు వేయండి కానీ చంద్రబాబుకు వేయకండి అని ఆయన కోరారు.
పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ని తిట్టడం మొదలు పెట్టింది అని పోసాని కృష్ణ మురళి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి జగన్ ని తిట్టింది.. నేను స్కిల్ సెంటర్స్ కి వెళ్లి చూశానని.. బాబు బాగానే కంప్యూటర్స్ ఏర్పాటు చేశారని పురంధరేశ్వరి అన్నారు.