క్షవరం అయితేగానీ... వివరం తెలీదంటారు. ఆ యాక్టర్ టర్న్‌డ్ పొలిటీషియన్‌కు ఈ సామెత సరిగ్గా అతికినట్టు సరిపోయిందా? ఆయనకా క్షవరం కూడా అట్టా ఇట్టా కాకుండా.... మాడు మంటపుట్టేలా.... ఇక నాకొద్దు బాబోయ్, నన్నొదిలేయండ్రా నాయనోయ్... అంటూ గావు కేకలు పెట్టేలా అయ్యిందా? అందుకే మీకు, మీ రాజకీయాలకో దండంరా బాబూ... అంటూ సాష్టాంగ నమస్కారం పెట్టిమరీ చెబుతున్నారా? అంతలా తత్వం బోథపడ్డ ఆ నటుడు ఎవరు? ఏంటా దండాల కథ?
తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. 100కు పైగా చిత్రాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా వ్యవహరించి, గతంలో ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి శక్తివంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, కొంత విరామం తర్వాత, మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు పోసాని. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పోసాని కృష్ణమురళి కొత్త చిత్రంతో రంగంలోకి దిగుతున్నారు. Also Read:Jyothi Krishna:…
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో…
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ALso Read:…
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.. సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణమురళి.. అయితే, పోసాని పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.
Posani Krishna Murali: సినీ నటుడు, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు ఈ రోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.. దీంతో, 24 రోజుల ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అయితే, ఇతర కేసుల్లో బెయిల్ మంజూరు అయినా.. పోసానికి సీఐడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు.. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన సన్నిహితులతో కలసి హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు పోసాని కృష్ణ మురళి.. అయితే, పోసాని…
ఎట్టకేలకు 24 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ.. గుంటూరు జిల్లా జైలు నుంచి ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు విడుదలయ్యారు పోసాని కృష్ణమురళి.. జైలు బయట పోసానిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు.. మంత్రి నారా లోకేష్ చెప్పటం వల్లే మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు బయటకు వదలకుండా ఆపారు.. లోకేష్ కనుసన్నలలో అంతా నడుస్తుందని ఆరోపించారు..
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో హైదరాబాద్ వెళ్లి పోసానిని అరెస్ట్ చేసారు పోలిసులు. ఓ వైపు ఈ కేసు వ్యవహారం నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో కొద్దికాలంగా పోసాని జైల్లోనే ఉన్నారు. తాజాగా పోసానిపై నమోదైన సీఐడీ కేసులో బెయిల్ లభించింది. దీంతో…