చదువుకోవడానికి ట్యాబ్ లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని అంటున్నారు అంటూ పోసాని కృష్ణ మురళి తెలిపారు. రామోజీ రావు పిచ్చిగా రాస్తున్నాడు.. రామోజీ రావు గాడ్ని నేను ప్రశ్నిస్తున్నాను.. ఎక్కడో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే పోర్న్ వీడియోస్ చూస్తున్నాడు ఇది తప్పు.. అప్పుడు ఒక్కడు చేసిన తప్పుకి అసెంబ్లీనీ రద్దు చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. ట్యాబ్లలో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది.. ఇతర ఏవీ కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుంది.. 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో నేను అసిస్టెంట్ మేనేజర్ గా చేశాను.. రామోజీ చాలా హానెస్ట్ కదా అని నేను అనుకున్నాను.. పేదల డబ్బులను దోచుకుతింటున్నాడు అంటూ పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.
ఒక్కో మార్గదర్శి మేనేజర్ నెలకు పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అంటూ పోసాని కృష్ణ మురళి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం కమ్మ వాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నావు.. కమ్మవాళ్లల్లో కూడా కేవలం నీ చెంచా చంద్రబాబునే కోరుకుంటావు.. మద్యపానం నిషేధిస్తే పెద్ద పెద్ద ఫోటోస్ వేసి రాశావు.. మళ్లీ మద్యపానం కావాలని ఇన్కమ్ కోసం ఉండాలని నువ్వే రాశావు అని ఆయన ఆరోపించారు. కాళ్లు చేతులు పని చేయలేక రామారావు లక్ష్మీపార్వతిని చేసుకున్నారు.. నన్ను నమ్మి ప్రేమించి గౌరవించే వాళ్లు కావాలని లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ చేసుకున్నారు.. రామోజీరావు లక్ష్మీపార్వతి గురించి పిచ్చి రాతలు రాశారు.. ఆడ కూతురు జీవితాన్ని నాశనం చేసిన పంది రామోజీరావు.. ప్రతిపక్షానికి మిత్రపక్షంగా ఉంటాడు రామోజీరావు.. ఏపీలో జగన్ ఉండకుడదని ప్రయత్నాలు చేస్తున్నారు.. కమ్మవాళ్లకి కూడా పెన్షన్స్ ఇస్తున్నాం కదా.. కోట్లు లక్షలు ఉన్న కమ్మవాళ్లు కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు ఇది ఎందుకు నువ్వు రాయలేవు? కదా అని పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.