సినీ రచయిత నటుడు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించిన పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నన్ను ఎవరూ ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి…
ప్రముఖ నటుడు, వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి కొత్త చిక్కులు మొదలయ్యాయి. పోసాని కృష్ణమురళిని 2022 నవంబర్ 03న ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద విజయవాడ లో కేసు నమోదు అయింది.…
పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.. వైసీపీ హయాంలో పోసాని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని.. అయితే, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడరని మండిపడ్డారు
డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు.. ప్రజా సేవ అని పార్టీ పెట్టి మూసేసాడని ఫైర్ అయ్యారు పోసాని.. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టిన ఆయన.. సినిమా లానే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు.. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Posani Krishna Murali Comments on Dasari Narayana Rao: ఏపీతో పాటు తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ సీజన్ కావడంతో ఎన్టీవీ ప్రత్యేకంగా క్వశ్చన్ అవర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తాజాగా ఈరోజు నిర్వహించిన క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి ఏపీ వైసీపీ నేత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక…
తాను డబ్బులు తీసుకొని ఏ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టలేదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. కావాలంటే నార్కో టెస్ట్ నిర్వహించండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ అవ్వకముందు నుంచే ప్రెస్‌మీట్‌లు పెట్టానన్నారు. గత 15 ఏళ్లుగా ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నానన్నారు. పెయిడ్‌గా ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినా వేరే దేశానికి వెళ్లిపోతానన్నారు.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నేడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటర్ల వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్చారు అని పోసాని కృష్ణ మురళి అన్నారు. మగ వాలంటర్లు నారా లోకేష్ లా తాగుబోతులు.. తిరుగు బోతులు కాదు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు ఉండాలి.. వాలంటర్ల వ్యవస్థపై చంద్రబాబుకు కన్ను కుట్టింది అని పేర్కొన్నారు.