Umapathi Trailer Launched: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది ఈ క్రమంలోనే అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకోగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అందమైన గ్రామీణ వాతావరణం, ఊర్లో రకరకాల మనస్తత్వాలున్న మనుషులు, అల్లరి చిల్లరగా తిరిగే హీరో.. రెండు ఊర్ల మధ్య ఏదో గొడవలు ఉన్నట్లు.. ఆ గొడవలు హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకులుగా మారినట్టు చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్‌లో సహజత్వం ఉట్టి పడుతోంది.
Allu Arjun: పుష్ప 2 కోసం అన్ని కోట్ల ఆఫర్.. అయినా కాదనుకున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?
విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉండడమే కాదు ఆర్ఆర్ కూడా బాగుంది. ఇక కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. ఇక ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించగా రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను చూసుకోగా, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.