Posani Krishna Murali: తనకు ముగ్గురిపై చాలా నమ్మకం ఉంది.. ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ అయితే.. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావే అన్నారు ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విపక్షాలపై విరుచుకుపడ్డ ఆయన.. కేంద్రంలో ఎప్పుడూ బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటా.. తెలంగాణలో మళ్లీ మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటా.. ఏపీలో జగన్ సీఎం కావాలనే కోరుకుంటానన్నారు..
Read Also: Minister KTR Exclusive Interview: ఎన్టీవీ లైవ్‌లో మంత్రి కేటీఆర్..
వైఎస్ జగన్ ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పోసాని.. తాన మరిది చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడని.. నా మరిది సీఎం అయితే నాకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపిస్తాడని.. కేంద్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తాడని పురంధేశ్వరి ఈ స్కెచ్ గీశారంటూ ఆరోపణలు గుప్పించారు.. ఇక ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు పోసాని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు… అపర మేధావి, హానేస్ట్ ఫెలో, విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.