Posani Krishna Murali: జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు. “సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమైన చేస్తామని జగన్ గతంలోనే చెప్పారు. చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వచ్చినప్పుడు స్టూడియోలు కడతా అంటే స్థలం ఇస్తామని జగన్ చెప్పారు. పాతుకు పోయిన తెలుగు ఇండస్ట్రీ రావటం కుదరదు. సినీ నటులు ఏపీకి వచ్చి పోవటం మాత్రమే చేయగలరు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. గతంలో మద్రాస్ లో ఉన్నపుడు తెలుగు వారు ఉన్న చోటుకు అని పరిశ్రమ వచ్చింది. ఇపుడు ఉన్నది తెలుగు గడ్డ మీదే కాబట్టి అక్కడ నుంచి రావటానికి ఆసక్తి చూపరు” అని తెలిపాడు.
Gayathri Gupta: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఫిదా బ్యూటీ..
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఇక పరిశ్రమలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలో నటులందరూ ఒక్కటే. జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే. సినిమా ఇండస్ట్రీలో చాలా పేద ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినీ నటులందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారితో పాటు సాంకేతిక నిపుణులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తాం. ఆన్‌లైన్‌లో నటుల వివరాలు అన్ని పొందుపరుస్తాం. ఉచితంగానే నటులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. షూటింగ్‌లకు వెళ్లే సినీ నటుల కోసం బస్సు రాయితీ ప్రతిపాదనపై చర్చిస్తున్నాం. ఇండియాలో ఇది ఫస్ట్ టైమ్. ఎక్కడ కూడా ఇలాంటి రాయితీలు పెట్టలేదు. ఇకనుంచి నటుల ఎంపిక కూడా మా వెబ్ సైట్ లో చూడొచ్చు. అందరి ఫోటోలను అందులో ఉంచుతాం. నటులు అని నొక్కగానే వేలమంది నటులు మీకు కనిపిస్తారు.. మీకు ఎంతమంది కావాలో.. అందులోనే సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని నేను మద్రాస్ లో చూసాను ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే : పోసాని కృష్ణ మురళి#posanikrishnamurali #Ysrcp #JrNTR #NTVNews #NTVTelugu pic.twitter.com/Y6CKqtCT3T
— NTV Telugu (@NtvTeluguLive) October 13, 2023
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..