పోసానికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. లక్ష రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది.. ఇక, వారానికి రెండు రోజులు సీఐడీ రీజనల్ ఆఫీసుకి వచ్చి సంతకాలు చేయాలని షరతులు విధించింది.. విచారణకు పూర్తిగా సహకరించాలి.. ఈ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు.. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదు.. పత్రికల్లో ఎటువంటి ప్రకటనకు చేయకూడదు అని గుంటూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు..
పోసానికి ఊరట లభించింది.. ఇవాళ లేదా రేపు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.. ఇవాళ సీఐడీ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజురు చేసింది గుంటూరు కోర్టు.. దీంతో, ఆయనకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయ్యింది..
థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు జడ్జి.. విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించగా.. జడ్జి ప్రశ్నలకు సమాధానమిచ్చిన పోసాని.. థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు, లాయర్ల సమక్షంలోనే విచారణ జరిగిందని తెలిపారు.
పోసానిపై మరో ఫిర్యాదు అందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు..
పోసాని తరుపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు అని పోసాని జడ్జి ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పేర్కొన్నారు.
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు రావడంపై సందిగ్ధం నెలకొంది. కోర్ట్ బెయిల్ ఇచ్చినా.. బయటకు రావడం డౌటేనన్న అనుమానాలు నెలకొన్నాయి. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు గుంటూరు కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట పోసానిని ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన…
అన్ని కేసుల్లో బెయిల్స్ పోసాని కృష్ణ మురళికి సంబంధిత న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ…
స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీల్లో బీజేపీ తరపున సీనియర్ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు నామినేషన్ వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారం ఆశీర్వాదం కోరడం జరిగింది.. బీజేపీ సిద్ధాంతంతో పార్టీ విస్తరణ కోరకు నిరంతరం సోము వీర్రాజు సేవలు అందిస్తున్నారు.. ఎమ్మెల్సీ స్థానానికి సరైన అభ్యర్థిగా అతడ్ని ఎన్నుకోవడం…