Posani Krishna Murali: సినీ నటుడు, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక, గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీసులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమవారం నాడు సంతకం చేసేందుకు వచ్చిన సమయంలో నోటీసులు ఈ నోటీసులు అందజేశారు.
Read Also: Nagarkurnool: SBI బ్యాంకులో మేనేజర్ చేతివాటం.. రూ. కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్న వైనం..
అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళికి గత నెలలో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం నాడు సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లాలని తెలిపింది.. దీంతో సంతకం చేసి తిరిగి వెళుతుండగా పోసానికి సీఐడీ కార్యాలయం దగ్గర తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు.