Goutham: మురళి నాయక్ కు మర్యాద ఇచ్చి మాట్లాడండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్ర రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు.
Also Read: Covid Vaccine: కోవిడ్ తర్వాత మరణాలకు వాక్సిన్‌లు కారణం కాదు.. తాజా అధ్యయనంలో వెల్లడి..
Also Read
ఈ సందర్భంగా హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఇటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. దర్శకుడు నవీన్ కుమార్ ఎంతో కమిట్మెంట్తో ఉండే వ్యక్తి. చాలా తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను ఎంతో మంచి అవుట్ పుట్ తో తీసుకొచ్చాము. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎంతో సీనియర్ నటినటులు మాతో నటించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. టెక్నికల్ టీం అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాకు సపోర్టుగా వచ్చిన ప్రతి అతిధికి నా ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా చూస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదేనా సమాధానం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మురళి నాయక గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్” అంటూ ముగించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!