గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన పై సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్న కేసు చిక్కుముడి వీడటం లేదు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కని సీసీ ఫుటేజ్ లో గుర్తించిన చిలకల గూడ పోలీసులు.. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. అయిన బాధితురాలి అక్క ఆచూకీ లభించడం లేదు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే సీసీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆధారాలు సేకరించింది క్లూస్ టీం & పోలీసులు.…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.. ఒకే పోలీస్ స్టేషన్లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. అయితే, సీఐ, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది…
రాజేంద్రనగర్ బుద్వేల్ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఐదుగురం లిఫ్ట్ లో ఇరుక్కుని పొగ కారణంగా శాస్వ అడడం లేదని 100 కు కాల్ చేసారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన రాజేంద్రనగర్ పోలీసులు. బుద్వేల్ ప్రాంతానికి ఉరుకులు పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం లో ఐదుగురు చిక్కుకున్నారనే సమాచారం తో బుద్వేల్ ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బందితో పాటుగా అంబులెన్స్ లు కూడా వెళ్లాయి. బుద్వేల్ లో వున్న ప్రతి గల్లిని చుట్టుముట్టారు ఐదు మంది ఎస్ఐలు,…
గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన పై గోపాలపురం ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ… చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ నరసింహులు అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు.…
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణను మీడియా ముందు హజరుపరచారు పోలీసులు. అనంతరం ఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ… నల్లపు రమ్య, కుంచాల శశికృష్ణకి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పరిచయం పెరిగింది.. ఆ తరువాత నుండి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ వేదిస్తున్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ శభాష్ అనిపించేలా రాష్ట్రంలో మహిళల రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ టైంలో ఇలాంటి ఘటన దురదృష్టకరం అన్నారు. మహిళలు సోషల్ మీడియా ట్రాప్ లో పడకుండా జాగ్రత్త…
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద బీటెక్ విద్యార్థిని రమ్యను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య ను ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి దారుణం జరగటం బాధాకరం అని తెలిపారు. గతేడాది ఆగస్టు 17న కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతిని హత్య చేసిన దుర్మార్గుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు అని పేర్కొన్నారు.…
పెద్దపల్లి జిల్లాలో కాళ్ళు చేతులు కట్టేసి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వైద్యం చేసారు. అయితే ఆ వైద్యుల నిర్లక్ష్యానికి ఉత్తరాఖండ్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉత్తరాఖండ్ నుండి కర్నూల్ కు కూలి పనికి వెల్తుండగా ఓదెల మండలం పొత్కపల్లి వద్ద ప్రమాదవశాత్తు పడిపోయాడు అతుల్ దలి కూలి. అనంతరం 108 లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని కాళ్ళు చేతులు కట్టేయడంతో అతుల్ దలి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. దాంతో…
ఆత్మహత్య లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హుస్సేన్ సాగర్. నిన్ను ఒక్కరోజే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఐదుగురు మహిళలు. అయితే ఆ ఐదుగురిని లేక్ పోలీసులు కాపాడారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో గొడవలు, ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్యా యత్నంకి పాల్పడ్డారు మహిళలు. కానీ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కు అప్పగించారు పోలీసులు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 285 మందిని కాపాడిన లేక్ పోలీస్ లు కోవిడ్ తరువాత ఆత్మహత్యలు…
భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…
నగరంలో ఈ మధ్య కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు అని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. ఆరు స్టేషన్ ల పరిధిలో జరిగిన బైక్ దొంగతనల్లో 27 మందిని అరెస్ట్ చేసాం. బైక్స్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల్లో విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతనికి చెందిన మాలోతు ఎర్రన్నాయుడు తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసాం. వీరితో పాటు దొంగిలించిన బైక్స్ కొనుగోలు…