విశాఖలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ భారీ జీఎస్టీ మోసంకి పాల్పడింది. శ్రీపాద్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 69కోట్ల రూపాయలు టాక్స్ ఎగ్గొట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎండీ శ్రీనివాస రెడ్డి ఇంట్లో కంపెనీకి చెందిన అకౌంట్స్, ఇతర డాక్యుమెంట్లు సీజ్ చేసింది ఆదాయపన్ను శాఖ. 2006నుంచి ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నడిపిన శ్రీపాద్ ఇన్ఫ్రా… ఇప్పటి వరకు నాలుగు సార్లు కంపెనీ పేర్లు మార్చి వ్యాపారం చేసాడు. కీలక డాక్యుమెంట్లు ఆధారంగా లోతైన విచారణ జరుపుతున్నారు అధికారులు. త్వరలోనే మరికొన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉంటాలు తెలుస్తుంది.