కార్వీ స్కామ్‌లో బాధితులుగా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్వీ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు షాక్ ఇచ్చిందా? పెట్టుబడులు పెట్టిన వారు.. కక్కలేక మింగలేక ఆందోళన చెందుతున్నారా? ముందుకొచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదా? అధికార, రాజకీయవర్గాల్లో కార్వీపై జరుగుతున్న చర్చ ఏంటి?
కార్వీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల పెట్టుబడులు!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
కార్వీ కుంభకోణంలో CCS పోలీసులు తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల పెట్టుబడులు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులు పార్థసారథిని చూసే కార్వీలో ఇన్వెస్ట్ చేశారు. వీరిలో ముఖ్యమైన రాజకీయ నేతలతోపాటు.. ఉభయ రాష్ట్రాలకు చెందిన సీనియర్, రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారట. తమ అక్రమ సంపాదనను కార్వీలో పెట్టుబడుల రూపంలో మళ్లించినట్టు సమాచారం. ఇప్పుడు స్కామ్ బయటపడటంతో తమ డబ్బులు తిరిగొస్తాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారట.
అక్రమ సంపాదన కావడం వల్లే ఫిర్యాదు చేయడం లేదా?
ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత ప్రముఖులెవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వారి పెట్టుబడులపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సక్రమ సంపాదనే అయితే.. చిల్లి గవ్వపోయినా.. ఊరుకోరు. కానీ.. ఇక్కడ పెట్టుబడిగా పెట్టిందంతా అక్రమ సంపాదన కావడంతో.. ఫిర్యాదులు చేస్తే లేనిపోని తలపోటులు వస్తాయని సైలెంట్ అయిపోయారట. స్కామ్ వెలుగు చూసినప్పటి నుంచి ఒకరినొకరు పలకరించుకుని.. బోరుమంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు మాత్రం.. పరువు పోతుందనే ఆలోచనతో ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తున్నారట.
విచారణలో ప్రముఖుల పేర్లు బయటపడ్డాయా?
ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టడం కార్వీ స్కామ్‌లో కీలకం. వీటిపై CCS ఫోకస్ పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో 700 కోట్లు పూర్తిగా నష్టపోయినట్టుగా పార్థసారధి విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆయన్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనే ప్రముఖల పేర్లు వెలుగులోకి వచ్చాయట. వారంతా పార్థసారథిని విశ్వసించి కోట్లు కుమ్మరించినట్టు తెలుస్తోంది. వారి నుంచి పోలీసులు సమాచారం తీసుకుంటారో లేదో కానీ.. విషయం తెలిసినప్పటి నుంచి ఆందోళనలో ఉన్నారట ఆ ప్రముఖులు.
ఇన్వెస్ట్ చేసిన పోలీసులు, నేతలు ఎవరు?
ముఖ్యంగా సీనియర్ పోలీస్ అధికారులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారని తెలియడంతో రెండు రాష్ట్రాల్లోని డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారెవరు.. వెనకాముందు ఆలోచించకుండా ఎలా ఇన్వెస్ట్ చేశారు అనేది కొందరు ఆరా తీస్తున్నారట. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి సామాన్యులతోపాటు పేరున్న బడాబాబులను కూడా పార్థసారథి ఈజీగా బుట్టలో వేసుకున్నారని చర్చ జరుగుతోంది. మరి.. ఆ పేర్లు బయటకొస్తాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!