పోలీసులతో నాకు ప్రాణహాని ఉంది అని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తాజాగా మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ.. నాకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. నాపై అక్రమ కేసులు పెట్టడమే మీ ఫ్రెండ్లీ పోలీసింగా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు సినిమా చూపించటంలో డీజీపీ రాంగోపాల్ వర్మను మించిపోయారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో నాపేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించారు. 6093 ఆర్థిక నేరగాడి…
బంజారాహిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. 30 గ్రాముల MDMA ,LSD 4 బోల్ట్స్ ,50 గ్రాముల చరాస్ , 10 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేసారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. అరెస్ట్ అయిన ముగ్గురు శివశంకర్, మనికాంత్, శిల్పా రాయ్ గా తెలిపారు. అయితే శిల్పా రాయ్ వెస్ట్ బెంగాల్ కు చెందిన…
తెలంగాణలో దిశ కేసు ఎంత సంచనలం రేపిందో అందరికి తెలుసు. ఆ కేసులు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ ఎన్ కౌంటర్ పై దిశ కమీషన్ విచారణ వేగవంతం వేగవంతం చేసింది. నేడు దిశ కమిషన్ ముందు మరోసారి ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలు హాజరు కానున్నారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ నమోదు చేసుకుంటున్న కమిషన్… ఇప్పటికే పలువురు సాక్ష్యులను విచారించింది. సిట్…
కార్వీ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు షాక్ ఇచ్చిందా? పెట్టుబడులు పెట్టిన వారు.. కక్కలేక మింగలేక ఆందోళన చెందుతున్నారా? ముందుకొచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదా? అధికార, రాజకీయవర్గాల్లో కార్వీపై జరుగుతున్న చర్చ ఏంటి? కార్వీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల పెట్టుబడులు! కార్వీ కుంభకోణంలో CCS పోలీసులు తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల పెట్టుబడులు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులు పార్థసారథిని చూసే కార్వీలో ఇన్వెస్ట్ చేశారు.…
మెదక్ కొల్చారంలో ఐఎంఎల్ ( మద్యం స్టోరేజ్ సెంటర్) కి బీరు బాటిల్స్ తీసుకొస్తున్న లారీని దొంగలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో బీర్ ఫ్యాక్టరీ లో కార్టన్లను లారీ లో లోడ్ చేసారు. అక్కడి నుండి కొల్చారం మండలం చిన్న ఘనపూర్ డిపోలో లోడ్ ను దింపేందుకు లారీ వచ్చింది. కానీ అక్కడ వరుసగా లారీల క్యూ ఉండడంతో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. సమయం చూసుకొని లారీతో సహా బీర్లను తీసుకుని వెళ్లి పోయారు దొంగలు.…
కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడని.. ఈ ఘటనలో ఆమె గొంతుకు తీవ్ర గాయం అయ్యిందని.. దీంతో.. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ప్రచారం జరిగింది.. అయితే, మొదట హత్యాయత్నాంగా నమ్మించిన వివాహిత… తానే గొంతు కోసుకున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. బ్లెడ్ తో…
సిటీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్. లగ్జరీ కార్లను హైటెక్ టెక్నాలజీతో ఎత్తుకెళ్తున్నాడు ఈ ఎంబీఏ విద్యార్థి. జైపూర్ కు చెందిన సత్యేంద్ర సేఖావత్ కోసం సంవత్సరం నుండి గాలిస్తున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో పలు లగ్జరీ కార్లను దోచేసిన సేఖవత్… టెక్నికల్ నాలెడ్జ్ తో సాఫ్ట్వేర్ రూపొందించి కార్లను అపహరిస్తున్నాడు. పార్క్ హయత్ లో ఓ ప్రొడ్యూసర్ కార్ ను దొంగలించాడు సేఖవత్. కేసు నమోదు చేసి జైపూర్ వరకు…
సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. సూర్యాపేట మండలం రాజు నాయక్ తండా ఓ మహిళలను అందరూ చూస్తుండగా కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ దాడి చేశారు కొందరు వ్యక్తులు.. అయితే, ఇవాళ ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.. మహిళను వివస్త్రను చేసి కళ్లలో కారం కొట్టి వీధుల్లో తిప్పుతూ దాడి చేసిన తండావాసులను అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లారు సూర్యాపేట రూరల్ పోలీసులు.. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని…
మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం అని విశాఖపట్నం రూరల్ ఎస్పీ తెలిపారు. గంజాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మూగజీవాల అక్రమ, రవాణా మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నాం. దారకొండ ఏజెన్సీ ప్రాంతానికి పదికి పైగా వాహనాల్లో కొంతమంది వచ్చి ఇక్కడ అలజడి సృష్టించి వెళ్తున్నట్లుగా స్థానిక గ్రామస్తుల నుండి మాకు( పోలీసులకు)…
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.. స్పాట్లోనే ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి…