సిటీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్. లగ్జరీ కార్లను హైటెక్ టెక్నాలజీతో ఎత్తుకెళ్తున్నాడు ఈ ఎంబీఏ విద్యార్థి. జైపూర్ కు చెందిన సత్యేంద్ర సేఖావత్ కోసం సంవత్సరం నుండి గాలిస్తున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో పలు లగ్జరీ కార్లను దోచేసిన సేఖవత్… టెక్నికల్ నాలెడ్జ్ తో సాఫ్ట్వేర్ రూపొందించి కార్లను అపహరిస్తున్నాడు. పార్క్ హయత్ లో ఓ ప్రొడ్యూసర్ కార్ ను దొంగలించాడు సేఖవత్. కేసు నమోదు చేసి జైపూర్ వరకు వెళ్లారుబంజారాహిల్స్ పోలీసులు. ఏప్రిల్ లో నాచారం వద్ద మరో కార్ ను అపహరించాడు సేఖవత్. తాజాగా సైబరాబాద్ పరిధిలో దుండిగల్ లో మరో లగ్జరీ కారు మాయం చేసాడు. అయితే జైపూర్ లో ఉన్న సేఖవత్ భార్య ను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె బెయిల్ పై విడుదలైంది. అయితే సేఖవత్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు 3 కమిషనరేట్ల పోలీసులు.