కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడని.. ఈ ఘటనలో ఆమె గొంతుకు తీవ్ర గాయం అయ్యిందని.. దీంతో.. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ప్రచారం జరిగింది.. అయితే, మొదట హత్యాయత్నాంగా నమ్మించిన వివాహిత… తానే గొంతు కోసుకున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. బ్లెడ్ తో తనకు తానే గొంతు కోసుకున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు.. గతంలో ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. రెండు నెలల క్రితం కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది.