విశాఖలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ భారీ జీఎస్టీ మోసంకి పాల్పడింది. శ్రీపాద్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 69కోట్ల రూపాయలు టాక్స్ ఎగ్గొట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎండీ శ్రీనివాస రెడ్డి ఇంట్లో కంపెనీకి చెందిన అకౌంట్స్, ఇతర డాక్యుమెంట్లు సీజ్ చేసింది ఆదాయపన్ను శాఖ. 2006నుంచి ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నడిపిన శ్రీపాద్ ఇన్ఫ్రా… ఇప్పటి వరకు నాలుగు సార్లు కంపెనీ పేర్లు మార్చి వ్యాపారం చేసాడు.…
అసలే కరోనా సమయం.. బతకడమే కష్టంగా మారింది.. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధిపై కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. ఈ సమయంలో.. ఈఎంఐలు కట్టడం కష్టంగా మారిన పరిస్థితి.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌కు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి.. మరోవైపు పోలీసుల వేధింపులు పెరిగాయని.. పెట్రో ధర భారం కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.. ఈ ఘటన హన్మకొండలోని కాళోజీ జంక్షన్ లో…
సంవత్సరం క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసుల దర్యాప్తు సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేధింపుల సమస్యలతో మహిళా మృతి ఘటన ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మృతి చెందింది. అయితే, ఉత్తర మరణంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది… ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్…
ఖాకీలకు కొన్ని పోలీస్ స్టేషన్లపై సెంటిమెంట్ ఎక్కువ. కలిసి వస్తుంది అనుకుంటే.. పోస్టింగ్‌ల కోసం ఓ రేంజ్లో పైరవీలు చేస్తారు. అదే రివర్స్‌లో ఉంటే పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే హడలెత్తిపోతారు. ప్రస్తుతం ఆ PS గురించి అదే చర్చ జరుగుతోంది. మాకొద్దీ తలనొప్పి అని విసుగెత్తిపోతున్నారట అధికారులు. వైసీపీ, టీడీపీ మధ్యలో పోలీస్‌గా చర్చల్లో ఉన్న ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. అధికారులు లేక స్టేషన్ ఖాళీ! చిత్తూరు జిల్లా చంద్రగిరి. పోలీస్‌శాఖ పరంగా…
ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి…
కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కార్వీ ఎండీ పార్థసారథిని చంచల్ గూడా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. రెండు రోజుల సీసీఎస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రెండు రోజులపాటు పార్థసారథిని ప్రశ్నించనున్న పోలీసులు… చంచల్ గూడ జైలు నుండి సీసీఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. మూడు వేల కోట్ల రూపాయల స్కాంపై పూర్తి వివరాలు రాబట్టనున్నారు సీసీఎస్ పోలీసులు. డీ మాట్ అకౌంట్ ఖాతాదారుల డిపాజిట్లను తనఖా పెట్టి రకరకాల…
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను అరెస్ట్ చేసారు. అతడిని బెంగుళూరులో అరెస్ట్ చేసారు విజయవాడ పోలీసులు. రాహుల్ హత్య కేసులో ఏ2 గా ఉన్నాడు కోగంటి.…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ప్రాణాలు వదిలింది.. పీజీ చేస్తున్న మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలింది… హెచ్‌సీయూలోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే మౌనిక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.. చదువు ఎంత చదివినా నా మనసులోకి ఎక్కడం లేదని సూసైడ్‌లో మౌనిక పేర్కొన్నట్టు తెలియజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ…
మియాపూర్‌లో కలకలం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 జనవరి 19వ తేదీన ఓ మహిళపై హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో సామూహిక అత్యాచారం జరిగింది.. ఏడుగురు కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఎల్బీనగర్ న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితులకు జీవితఖైదు…
కరీంనగర్ లో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుంది అని కరీంనగర్ శాంతి భద్రతల అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాజాగా మాట్లాడిన ఆయన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచగా అందులో భాగంగా గన్ తో దిగిన ఫోటో కనుగొన్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘాలో ఫోటో దిగిన వ్యక్తిని గుర్తించారు. అతను కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన గడ్డం కృష్ణగా గుర్తించిన పోలీసులు తర్వాత ఆ ఫోటోలో ఉన్నది…