ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.. స్పాట్‌లోనే ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.