Road Accidents: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కొప్పోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Crime: విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.
Crime News: గ్రేటర్ విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహలు కలకలం రేపుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు స్థానిక ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
Gold Smuggling: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మస్కట్ నుంచి వచ్చిన విమాన సిబ్బంది వద్ద బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక, బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల విడుదలయ్యే అవకాశం ఉంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ రాష్ట్రంలోని భోపాల్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన రీల్ చూస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చిన తనపై దాడి చేశారని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తిరుపతిలో జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఐదుగురు మృతిచెందారు.. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి దగ్గర ఘోరు ప్రమాదం చోటు చేసుకుంది.. కంటైనర్ వాహనం కిందకు దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..