Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీ పర్యటనపై పోలీసుల విచారణ..!
- పూరీలో జ్యోతి మల్హోత్రా పర్యటనపై పోలీసులు దర్యాప్తు..
- పూరీలోని శ్రీ క్షేత్రంలో పర్యటించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా..
- శ్రీ క్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం..
- జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ ప్రియాంక గురించి ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ విషయాన్ని పూరీ పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
అయితే, 2024 సెప్టెంబర్ 26వ తేదీన పూరీ వచ్చిన జ్యోతి మల్హోత్రా.. ఇక్కడి శ్రీ క్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, శ్రీ క్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి.. పాకిస్తాన్ కు ఏమైనా సమాచారం అందించిందా అనే దానిపై అనేక అుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..
మరోవైపు, ఒడిశా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాక్ కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. పాక్ పర్యటనపై సోషల్ మీడియా వేదిక నుంచి ప్రియాంక ఆదివారం నాడు వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిణి అని నాకు తెలియదు.. పూరీ వచ్చిన ఆమెను ఫ్రెండ్ గానే భావించి.. కలిసి తిరిగాను.. నేను పాక్ కు విహారయాత్ర కోసం మాత్రమే వెళ్లాను.. అంతకుమించి ఏం లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించింది. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు. పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేం.. విచారణ కొలిక్కి వచ్చే వరకు ప్రియాంక పూరీ విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను ఒడిశా పోలీసులు శోధిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..