ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు…
పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక 20 మంది మావోల్లో 11 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది.
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్గఢ్లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం…
వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
Terrorist: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ కలకలం రేపుతోంది.. ఈ నెల 1వ తేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. ఆలయంలోని హుండీలో చోరీ పాల్పడ్డారు..
డబ్బు సంపాదనే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా హైదరాబాద్ లో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరిట కస్టమర్లకు వల వేస్తు వ్యభిచారానికి పాల్పడుతున్నారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. సర్వీస్ అపార్ట్ మెంట్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. థాయ్ లాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. నాయక్ అనే నిర్వాహకుడు ఈ దందాకు తెరలేపాడు.…
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు పెళ్లయిన మూడు నెలలకే నూరేళ్లు నిండాయి. పెళ్లయిన మూడునెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పూజ(24) నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిన్నశంకరంపేట (మం) అగ్రహారంలో చోటుచేసుకుంది. తమ కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త మహేష్, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. Also…