Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లురు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ తనపై దాడి చేశాడని టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు కొందరు వ్యక్తులు. పసిగట్టిన ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని భగ్నం చేశారు. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను అరెస్టు చేశారు. సిరాజ్ విజయనగరం లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి నగరంలో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి…
చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వెళ్లాడు ఓ యువకుడు. బిస్కెట్ల ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు జైలు సిబ్బంది. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తీసుకొచ్చాడు ఆ యువకుడు. బిస్కెట్ ప్యాకెట్లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.…
Big Shock To Maoists: ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా, మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నాంపల్లి నిలోఫర్ కేఫ్ సమీపంలో అయాన్ కురుషి రౌడి షీటర్ ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయాన్ ను హత్య చేశాక సంతోషకర వార్త అంటూ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పిన నిందితులు. నేడు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు. తన అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో బావ మునావర్ ను 2020 లో హత్య చేసిన అయాన్ కురుషి. అప్పటి నుంచి కోర్ట్ కేస్ కు హాజరు…
IT Company Fraud: హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు.
Crime: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని 6వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని మంగళవారం నాడు అరెస్టు చేశారు.
ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు…
పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.